వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు టైమ్ దగ్గరపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే మెగా ఫైనల్‌తో ఈ ఫస్ట్ టెస్ట్ ప్రపంచకప్ ముగియనుంది. తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఫైనల్ మ్యాచ్‌ల్లో తమ అలవాటుగా మారిన తడబాటుకు బ్రేక్ వేయాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు. ఏదేమైనా హోరాహోరీ తప్పదనిపిస్తున్న ఈ మెగా మ్యాచ్‌లో విజేత ఎవరనేది తేలాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.