దీనికి కారణం కరోనా వైరస్ భీతి. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాన్ని కుదిపిస్తోంది. దీంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి రెండు వన్డేలను ఒకే వేదికపై నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కేంద్ర క్రీడా శాఖ సూచనల మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఖాళీ స్టాండ్లలో జరిగే మ్యాచ్‌లను ఒకే వేదికపై నిర్వహిస్తే సరిపోతుందని బోర్డు ఆలోచిస్తోంది. రెండో వన్డే జరిగే లక్నోలోనే మూడో మ్యాచ్ కూడా నిర్వహించే విషయంపై బోర్డు ఆఫీస్ బేరర్లు దీని కోసం కసరత్తులు చేస్తున్నారు. మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 18వ తేదీన కోల్‌కతా వేదికగా జరగాల్సివుంది. కరోనా భయం కారణంగా దీన్ని కూడా లక్నోలోనే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇదే జరిగే తొలిసారి ప్రేక్షకులు లేకుండా వన్డే మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ, "మ్యాచ్‌లు కేవలం టీవీల్లో ప్రసారం అవుతాయి. అలాంటప్పుడు క్రికెటర్లు మరో వేదికకు వెళ్లి ఆడాల్సిన అవసరం ఏముంది? లక్నోలోనే మూడో మ్యాచ్ నిర్వహిస్తే ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు, ప్రసార సిబ్బంది తదితరులు కోల్‌కతాకు ప్రయాణం చేయాల్సిన పని ఉండదు. ఇది ఆచరణాత్మక విషయమే. బీసీసీఐ దీని గురించి పరిశీలిస్తోంది. ఏం జరుగుతో చూడాలి" అని వ్యాఖ్యానించారు.