దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌లో సత్తా చాటుకుంటున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా పనికి రావన్న విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ 500కు పైగా పరుగులు సాధించాడు. దాంతో ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత్ ఓపెనర్‌గా అరుదైన ఘనతను నమోదు చేశాడు.
అంతకుముందు వినోద్ మన్కడ్, బుద్ధి కుందిరేన్, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఒక టెస్టు సిరీస్‌లో ఐదు వందలపైగా సాధించిన భారత ఓపెనర్లు కాగా, ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. రాంచి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పైగా పరుగులు సాధించిన తర్వాత రోహిత్ ఈ మార్కును చేరాడు.
తొలి టెస్టులోనే 303 పరుగులు సాధించిన రోహిత్.. రెండో టెస్టులో 14 పరుగులు చేశాడు. దాంతో ఒక్క సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం రోహిత్ డబుల్ సెంచరీకి చేరువగా నిలిచాడు.ఇక నాల్గో వికెట్‌గా రహానే(115; 192 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. రోహిత్‌తో కలిసి 267 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రహానే ఔటయ్యాడు.
ఓపెనర్ రోహిత్ ఖాతాలో రికార్డు
రాంచి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరోమారు రెచ్చిపోయాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్... వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మరో సెంచరీ చేశాడు.
అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోనూ తొలి ద్విశతకం నమోదు చేసాడు. ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో ఓపికగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ 248 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 28 ఫోర్స్, 5 సిక్స్‌లు ఉన్నాయి.
కాగా, రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ నాలుగు వికెట్స్ కోల్పోయి 363 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్, జడేజా ఉన్నారు. అంతకముందు రహానే 2016 తర్వాత హోమ్ గ్రౌండ్‌లో తొలి సెంచరీ చేశాడు. రోహిత్‌తో కలిసి 267 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.