కొలంబో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్ 439 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన శ్రీలంక జట్టు 386కు ఆలౌటైంది. దీంతో, మరో మ్యాచ్ మిగిలి ఉండగా టెస్ట్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించడంలో స్పిన్నర్ల పాత్ర కీలకం. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, సెకండ్ ఇన్నింగ్స్‌లో జడేజా వీరవిహారం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజాకు 5 వికెట్లు, అశ్విన్, పాండ్యాకు చెరో రెండు వికెట్లు పడ్డాయి. ఫలితంగా 22 ఏళ్ల తర్వాత 2015లో తొలిసారి విరాట్ సారథ్యంలోని భారత్ క్రికెట్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా ప్రతిఘటించినా.. ఇన్నింగ్స్ ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది శ్రీలంక. సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక 386 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కరుణరత్నె (141), మెండిస్ (110) సెంచరీలతో చెలరేగినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 5 వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్‌తోనూ రాణించి 70 రన్స్ చేసిన జడ్డూ.. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతనికే దక్కింది.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్లకు 622 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. పుజారా (133), రహానే (132) సెంచరీలు చేయగా.. రాహుల్, అశ్విన్, జడేజా హాఫ్ సెంచరీలు చేయగా, లంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 5 వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్ట్‌ను కూడా నాలుగు రోజుల్లోనే ముగించిన భారత్.. రెండో టెస్ట్‌ను కూడా మరో రోజు మిగిలుండగానే చేజిక్కించుకుంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇది వరుసగా 8వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం.