టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. దూకుడుగా ఆడుతున్న ఆవిష్క ఫెర్నాండోను సుందర్ బోల్తా కొట్టించడంతో శ్రీలంక వికెట్ల పతనం ప్రారంభమైంది. అయితే కుశాల్ పెరెరా 34 పరుగులతో కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి లాంగ్ ఆన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోవడంతో అతని పోరాటం ముగిసింది.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, నవదీప్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.