ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‍‌షిప్ : టైటిల్ కోసం పోటీపడనున్న ఆ రెండు జట్లు

సోమవారం, 6 జనవరి 2020 (17:24 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. అయితే, ఈ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం 2019-2021లో ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుంది. తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో అనూహ్యంగా రెండో స్థానానికి ఎగబాకింది. 
 
కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కంగారులు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని చూపింది. ఫలితంగా ఆసీస్ ఖాతాలో 120 పాయింట్లను తెచ్చుకుంది. ఫలితంగా రెండో స్థానాన్ని మరింత పటిష్టపరుచుకుంది. టెస్టు క్రికెట్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీసేన.. ఆడిన మూడు సిరీస్‌ల్లో గెలుపొంది 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
 
మరోవైపు, టీమిండియా ఇప్పటికే ఆధిపత్యంలో ఉంది. భారత్ ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్కదానిలో కూడా ఓడిపోలేదు. ఫలితంగా 360 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. 
 
అంతకుముందు పాక్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకొని 120 పాయింట్లు నెగ్గిన కంగారూలు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేయడం ద్వారా 56 పాయింట్లు సాధించారు. 
 
చెరో రెండు టెస్టు సిరీస్‌ల్లో తలపడిన పాకిస్థాన్‌, శ్రీలంక 80 పాయింట్లతో మూడు, నాలుగు ర్యాంకులతో ఉన్నారు. న్యూజిలాండ్‌(60 పాయింట్లు), ఇంగ్లండ్‌(56 పాయింట్లు) తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు