ఇరాన్‌లోని భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని సురక్షితంగానే ఉన్నారని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా.. ఇరాన్, ఇరాక్‌లలోని చమురు క్షేత్రాల్లో, ఇతరత్రా పనుల ద్వారా జీవనోపాధి పొందేందుకు అనేక మంది భారతీయులు వెళ్ళి ఉన్నారు.
ఇరాక్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా. వారంతా క్షేమంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దౌత్య వేత్తతో పాటు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ఇప్పటికే ఇరాన్లో వున్న భారతీయులు క్షేమంగా వున్నారని, కానీ ఇకపై ఇరాన్‌కు కొత్త వారిని పంపవద్దంటూ ఆ దేశ రాయబార కార్యాలయం పేర్కొంది.