ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), కెప్టెన్ కోహ్లీ(4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ (36) కొద్దిగా పరుగుల వేట ప్రారంభించినప్పటికీ జోసెఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
పంత్ 49 బంతుల్లో 50 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 70 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్.. జోసెఫ్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 88 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లతో అయ్యర్ మొత్తం 70 పరుగులతో రాణించాడు.