ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత జట్టులో ఓపెనర్ పృథ్వీ షా (134), కెప్టెన్ విరాట్ కోహ్లీ (139), రవీంద్ర జడేజా (100 నాటౌట్)లు సెంచరీలతో కదం తొక్కగా రిషబ్ పంత్ 92, పుజారా 86 పరుగులతో రాణించాడు.
భారత స్పిన్నర్లు కుల్దీప్ ఐదు వికెట్లతో విండిస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీసుకోవడంతో పాలో ఆన్ ఇన్నింగ్స్‌లో విండిస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 272 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.