పొట్టి ప్రపంచ కప్ టీమిండియాదే : ఏబీ డివిలియర్స్

బుధవారం, 9 నవంబరు 2022 (12:04 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ భారత్ - ఇంగ్లండ్ జట్లు మధ్య గురువారం జరుగుతుంది.
 
ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, ఈ పొట్టి ప్రపంచ కప్ విజేత ఎవరవుతారన్న విషయంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే, సోషల్ మీడియాలోనూ రసవత్తర చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఓ జోస్యం చెప్పారు. గ్రూపు-ఏ నుంచి న్యూజిలాండ్, గ్రూపు బి నుంచి భారత్‌లు ఫైనల్‌కు చేరుకుంటాయి, పొట్టి ప్రపంచ కప్‌ విజేతగా టీమిండియా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
దీనికి కారణం... భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ళ ప్రతిభ పరవళ్లు తొక్కుతుందని, జట్టులోని ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సూర్యకుమార్, విరాట్ కోహ్లీలు భీకర ఫామ్‌లో ఉన్నారని చెప్పారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడని, అతడు కూడా ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు