విజయవాడ: ఇండియన్ క్రికెట్ మహిళా విభాగం రికార్డు సృష్టించింది. 3-0 తేడాతో వన్ డే ఇంటర్నేషన్ క్రికెట్‌లో విజయం సాధించింది. తొలిసారిగా ఏపీలోని మూలపాడులో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో దేశ,విదేశాల నుంచి క్రికెట్ జట్లు పాల్గొన్నాయి.
ఫైనల్లో వెస్ట్ ఇండీస్ జట్టుతో ఇండియన్ జట్టు తలపడింది. మన మహిళా క్రికెటర్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి, వెస్ట్ ఇండీస్ జట్టును 3-0 తేడాతో ఓడించారు. ఒన్ డే సిరీస్ కప్పును కైవశం చేసుకున్నారు.