క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఏకైక డే అండ్ నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన మిథాలి సేనకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ (64 బంతుల్లో 31) శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన పేస్ బలగమున్న ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి చూడచక్కని షాట్ లతో అలరించారు.
ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పునమ్ రౌత్ (27 పరుగులు), స్మృతి మంధాన (126 పరుగులు) ఉన్నారు. స్మృతి మంధాన ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే భారత్ భారీ స్కోరు నమోదు చేసే ఛాన్స్ ఉంది.