అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి మృతి.. ఎలా?

ఠాగూర్

సోమవారం, 6 అక్టోబరు 2025 (15:05 IST)
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సబ్బతి విష్ణుమూర్తి మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఓ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ అధికారి విష్ణుమూర్తి. ఆయన ఆదివారం రాత్రి తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. 
 
పోలీస్ శాఖలో కీలక బాధ్యలు నిర్వహించారని సహచరులు తెలిపారు. విధి నిర్వహణలో, ప్రజలకు సేవ చేయడంలో నిబద్ధతతో వ్యవహరించేవారని గుర్తు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను, సామాజిక, కార్య నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభను స్మరిస్తూ పలువురు నివాళులు అరిస్తున్నారు. 
 
కాగా, 'పుష్ప-2' చిత్రం విడుదల సందర్భంగా అల్లు అర్జున్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్దకు రావడంతో ఆయనను చూసేందముకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ప్రెస్మీట్ పెట్టిమరీ హీరో అల్లు అర్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పది నిమిమషాలు తాము పక్కకు వెళితే మీ పరిస్థితి ఏంటని సెలబ్రిటీలను నిలదీశారు. తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జునే బాధ్యుడని ఆయన స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి