విడుదలకు ముందు అత్యంత వివాదాస్పదమైన చిత్రం "పద్మావత్". అనేక వివాదాల నడుమ చిక్కుకుని చివరకు ఈ ఏడాది జనవరి 25న విడులైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి మన్నలు పొందింది. అంతేనా, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఫలితంగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది.
దీపికా పదుకునే ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఈ చిత్ర కలెక్షన్లపై ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో సినిమా 'పద్మావత్'. కాగా, ఇప్పటివరకు హిందీ వర్షన్‌లో మూడు వందల కోట్ల కలెక్షన్లు సాధించి ఈ క్లబ్‌లో నిలిచిన ఇతర సినిమాల్లో 'బాహుబలి-2', 'పీకే', 'భజరంగీ భాయిజాన్', 'సుల్తాన్', 'దంగల్', 'టైగర్ జిందా హై' ఉన్నాయి.