పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఠాకూర్ - ఢిల్లీ ప్లే ఆఫ్స్ సజీవం

మంగళవారం, 17 మే 2022 (07:51 IST)
స్వదేశంలో జరుగున్న 15వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చివరి దిశకు చేరుకున్నాయి. ఇందులోభాగంగా, సోమవారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‍లో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి పంజాబ్ జట్టును ఢిల్లీ బౌలర్ల శార్దూల్ ఠాకూర్ కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఫలితంగా 17 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ జట్టులోని ఆటగాళ్లలో మార్ష్ అర్థ సెంచరీ  (48 బంతుల్ల 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 63 పరుగులు చేశారు. అలాగే సర్ఫరాజ్ 32, లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 14 చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ తలా మూడు వికెట్లు చొప్పున తీశారు.
 
ఆ తర్వాత 160 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు విజయానికి 18 పరుగులు దూరంలో వచ్చి ఆగిపోయింది. పంజాబ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు నిప్పులు చెరిగే బంతుల ముందు పంజాబ్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. 
 
బెయిర్‌స్టో 28, శిఖర్ ధావన్ 19, రాహుల్ చాహర్ 25, జితేశ్ శర్మ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 17 పరుగుల తేడాతో గెలుపొందింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు