జనరేటర్ ఓన్లీ లైట్స్ కోసమేనా? డీఆర్ఎస్‌కు కాదా? ఇదేంటి?

శుక్రవారం, 13 మే 2022 (15:14 IST)
ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డీఆర్ఎస్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంతో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమి పాలై చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది చెన్నై. 
 
విద్యుత్ సమస్య కారణంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అందుబాటులో లేకపోవడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఇది సీఎస్కేకు ప్రతికూలంగా మారినట్టు అభిప్రాయపడ్డాడు. డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చే సరికే చెన్నై కీలక వికెట్లను నష్టపోవడం జరిగిందన్నాడు.
 
ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ... ''పవర్ కట్‌తో డీఆర్ఎస్ లేకపోవడం అన్నది నిజంగా ఆశ్చర్యమే. ఇంత పెద్ద లీగ్‌లో జనరేటర్ వాడతారు. మరి జనరేటర్ ఉన్నది స్టేడియంలో లైట్ల కోసమేనా? బ్రాడ్ కాస్టర్లు, వారి సిస్టమ్స్ కోసం కాదా? మ్యాచ్ జరుగుతున్నప్పుడు డీఆర్ఎస్ కూడా ఉపయోగంలో ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. లేదంటే మ్యాచ్ మొత్తానికి డీఆర్ఎస్‌ను వినియోగించుకోకూడదు. ఎందుకంటే ఇది చెన్నైకి నష్టాన్ని కలిగించింది. తొలుత ముంబై బ్యాటింగ్ చేసినా వారికి కూడా నష్టం కలిగేది''అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు