రేబిస్‌తో బాలిక మృతి.. కుక్క కరిచిందని తల్లిదండ్రులకు చెప్పలేదు.. చివరికి?

సెల్వి

ఆదివారం, 26 అక్టోబరు 2025 (17:15 IST)
నిజామాబాద్ జిల్లాలో రేబిస్‌తో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్‌ వ్యాధితో మరణించింది. లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది. 
 
ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు మందలిస్తారేమోనని భయపడి.. బాలిక ఈ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. మూడు రోజుల క్రితం లక్ష్మణ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. 
 
ఆమె కుక్కలా మొరగడం వంటి అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అయినా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ లక్ష్మణ మరణించింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు