ఈ సీజన్‌లో బుమ్రా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీ.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటు ముంబై పరిస్థితి భిన్నంగా ఉంది. అయితే ఈ మ్యాచుకు ఆ జట్టు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడంతో ఆ జట్టు బలం రెట్టింపు అయ్యింది.
"ఇషాంత్ శర్మ ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ అనుమతిని అంగీకరించాడు. లెవల్ 1 ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు, మ్యాచ్ రిఫరీ నిర్ణయం తుది మరియు కట్టుబడి ఉంటుంది" అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో పేర్కొంది.