మాతో చేతులు కలిపితే కనకవర్షం... ఇంగ్లండ్ క్రికెటర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీల వల

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:43 IST)
భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొనసాగున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఐపీఎల్‌లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు సైతం పోటీ పడుతుంటారు. దీంతో ఈ ఆటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చే పనిలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దృష్టిసారించాయి. ఇందులోభాగంగా, మెరుగైన క్రికెటర్ల కోసం గాలం వేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి తమతో చేతులు కలిపే కనక వర్షం కురిపిస్తామని ఆశ చూపిస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ఇప్పటికే ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఈ తరహా ఆఫర్ వెళ్లినట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్ లండన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కాకపోతే, ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని సంప్రదించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రాథమిక చర్యలు నడిచాయని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఇంగ్లీష్ కౌంటీలతు సంబంధం లేకుండా వారు పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాడిగా కొనసాగాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఐపీఎల్ ఇపుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను రూ.50 వేల కోట్లకుపైగానే అమ్ముడు పోయాయంటే ఐపీఎల్ ఆదరణ ఏ స్థాయిలో ఉందే ఇట్టే అర్థం చేసుకోవచ్చు,. ఇందులో ఒక్కో ఫ్రాంచైజీకి ఐదేళ్ల కాలానికి రూ.2500 కోట్లు చెల్లించనుంది. అంటే సంవత్సరానికి రూ.500 కోట్లు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ ఆర్థికంగా ఎంత బలమైనదో. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇపుడు విదేశీ క్రికెట్ లీగ్‍లలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి ప్రాంచేజీలతో కొనుగోలు చేస్తున్నాయి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు