ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ప్రసార హక్కులను స్మార్ స్పోర్ట్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం సీఎస్‌కే జట్టు రీ ఎంట్రీనేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ట్వంటీ-20 క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పది సీజన్లు ముగిసిన ఈ సీజన్ పోటీలను ప్రసారం చేసే హక్కులను స్టార్ స్మోర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించి.. వేలం ద్వారా కైవసం చేసుకుంది.
మరోవైపు రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2018లో జరిగే ఐపీఎల్‌లో బరిలోకి దిగనుంది. సీఎస్‌కే ఐపీఎల్‌లో ఆడనుండటంతో మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది. భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే మ్యాచ్‌ల కోసం వెచ్చించడం కంటే, ఐపీఎల్ ప్రసారాల కోసం భారీ మొత్తాన్ని వెచ్చిందని క్రీడా పండితులు అంటున్నారు. టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసారం కోసం రూ.33 కోట్లు వెచ్చించే ఈ సంస్థ.. ఐపీఎల్ కోసం రూ.55కోట్ల వరకు వెచ్చించినట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.