ఐపీఎల్ 2024 : తన రికార్డును బ్రేక్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఠాగూర్

బుధవారం, 22 మే 2024 (07:59 IST)
ఐపీఎల్ 2024 పోటీల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. 17వ సీజన్‌లో భాగంగా, మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా బ్యాటర్లు సునాయాసంగా విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఫలితంగా కేకేఆర్ జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది.
 
ఐపీఎల్ ప్లేఆఫ్స్ అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన జట్టుగా కోల్‌కతా రికార్డు నెలకొల్పింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై మరో 38 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా మ్యాచ్‌ను ముగించింది. ఇంత పెద్ద సంఖ్యలో బంతులు మిగిలివుండగా గతంలో ఏ జట్టూ ప్లే ఆఫ్స్‌లో ఈ స్థాయి విజయాన్ని సాధించలేదు. దీంతో చారిత్రాత్మకమైన రికార్డు కోల్‌కతా సొంతమైంది. దీంతో ఐపీఎల్ 2017 ఎడిషన్‌లో క్వాలిఫైయర్-2లో కోల్‌కతాపై 33 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలిచి రికార్డు సృష్టించగా అది ఇప్పుడు బ్రేక్ అయ్యింది.
 
కాగా 160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ జోడీ 97 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సిక్సర్లు, ఫోర్లతో ఇద్దరూ చెలరేగారు. దీంతో 13.4 ఓవర్లలోనే 8 వికెట్లు మిగిలివుండగా కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా నాలుగోసారి ఫైనల్ చేరింది. అంతకుముందు 2012, 2014, 2021 ఎడిషన్‌లలో కోల్‌కతా ఫైనల్ చేరింది. మరోవైపు కోల్‌కతా చేతిలో దారుణంగా ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో మే 24న రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడనుంది.
 
మరోవైపు, నాకౌట్‌లో అత్యధిక బాల్స్ మిగిలివుండగా విజయాలు..
సన్‌రైజర్స్ జట్టుపై కోల్‌కతా గెలుపు (2024) - 38 బంతులు మిగిలివుండగా 
కోల్‌కతాపై ముంబై (2027) - 33 బంతులు మిగిలివుండగా
కింగ్ లెవెన్స్ పంజాబ్‌పై చెన్నై జట్టు 31 బంతులు మిగిలివుండగా 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు