"దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. అభిమానులు మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయగలరు, మేము వారిని ఆపలేము. నా సహనటులతో కూడా, ప్రజలు నా పేరును లింక్ చేశారు. నేను అలాంటి వాటిపై పెద్దగా దృష్టి పెట్టను" అని మహీరా పేర్కొంది.
మహీరా వివరణ ఇవ్వడానికి ముందు, ఆమె తల్లి సానియా శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్లను తోసిపుచ్చింది. తన కూతురు సెలబ్రిటీ కాబట్టి, ప్రజలు ఆమె పేరును ఇతరులతో లింక్ చేస్తారని, అయితే అలాంటి ఊహాగానాలను నమ్మకూడదని ఆమె వివరించారు.
మహిరా శర్మ తన కెరీర్‌ను ప్రముఖ టెలివిజన్ షో తారక్ మెహతా కా ఊల్తా చాష్మాతో ప్రారంభించింది. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్‌లలో పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. అయితే, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్-13లో పాల్గొన్న తర్వాత ఆమె బాగా పాపులర్ అయ్యింది.