పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్‌కు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా హెచ్చరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై గెలిచిన అనంతరం తండ్రి తండ్రి అవుతాడు.. బిడ్డ బిడ్డ అవుతాడు.. అంటూ డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రంగా స్పందించాడు.
నజాఫ్ గడ్ నుంచి సెహ్వాగ్ వచ్చాడని, నజాఫ్ అనే వ్యక్తి ముస్లిం అని, అతని పేరుతో నజాఫ్ గఢ్ పేరు వచ్చిందని, నజాఫ్ గడ్ వాసులందరికీ అతనే తండ్రి అని... శ్రీలంక మీద ఓడిపోయిన టీమిండియాకు ఎవడు తండ్రి అంటూ అభ్యంతరకరంగా విమర్శలు చేశాడు. దీనిపై మనోజ్ తివారీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలాంటి వీడియో అప్ లోడ్ చేస్తే చెప్పులతో కొట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించాడు. 'నీలాంటి భాషే మేము కూడా వాడితే చెవుల్లోంచి రక్తం కారి చస్తావు' అంటూ హెచ్చరించాడు.
అంతేకాకుండా భారత్‌లో ఉన్న డాన్ లంతా తమ (ముస్లింలే) వారేనని... ఇప్పటికి ఉన్నవారు సరిపోరంటే.. తాను కూడా వస్తానని... అప్పుడు ఎవడు తండ్రో?, ఎవడు బిడ్డో? తేలిపోతుందని రెచ్చగొట్టాడు. దీనిపై యువ ఆటగాడు మనోజ్ తివారీ స్పందించాడు. రషీద్ లతీఫ్‌ని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరించాడు.
పాకిస్థానీలకు ఇంగ్లీష్ రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ...'ఎవడైనా ఇంగ్లిష్ తెలిసినవాడిని పక్కనపెట్టుకుని ఓసారి గూగుల్‌లో సెహ్వాగ్ కొట్టిన పరుగులు, నువ్వు కొట్టిన పరుగులు సరిచూసుకో... అప్పుడైనా నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు సెహ్వాగ్‌కు సమాధానం చెప్పేంత గొప్పవాడివా?' అని ప్రశ్నించాడు.