ఆసియా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం నామమాత్రమైన మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు యాజమాన్యం కీలకంగా భావిస్తుండడంతో అతడికి మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్పిన్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై భారత ఆలౌట్ కాగా, శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుల్దీప్, జడేజా కలిసి ఆరు వికెట్లు పడగొట్టారు. అక్షర్ మాత్రం తన ఐదు ఓవర్ల కోటాలో 29 పరుగులు సమర్పించుకొని నిరాశ పరిచాడు. ఇక బుమ్రాకు విశ్రాంతి నిచ్చి, మహ్మద్ షమీని ఆడించే చాన్సుంది. పిచ్ ఆధారంగా.. శార్దూల్, అక్షర్ పటేల్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.
మరోవైపు, ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య శుక్రవారం జరిగే సూపర్-4 మ్యాచ్ నామమాత్రంగా మారింది. దాంతో వన్డే వరల్డ్ కప్‌కు మరికొద్ది రోజులే ఉన్న తరుణంలో భారత్, బంగ్లాదేశ్ జట్లు తమ రిజర్వ్ క్రికెటర్లను ఈ మ్యాచ్లో పరీక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జట్లు (అంచనా) :
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయాస్. అయ్యర్/రాహుల్, కిషన్ (కీపర్), హార్టిక్, జడేజా, శార్డూల్/అక్షర్, కుల్దీప్, సిరాజ్, సమి/బుమ్రా,
బంగ్లాదేశ్: మెహీ హసన్, తన్జిద్/మహ్మద్ నయూమ్, లిటన్ దాస్ (కీపర్), షకీబ్ (కెప్టెన్), తాహిద్, ఆఫిఫ్ హౌసేన్, షమీమ్ హౌసేన్, నసూమ్ అహ్మద్, ఉస్కిన్, షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్.