అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నిగ్స్‌లో భారత్ కూడా 145 రన్స్‌కు చాపచుట్టేసింది. దీంతో భారత్‌కు కీలకమైన 33 పరుగుల ఆధిక్యం మాత్రం దక్కింది.
రూట్ బంతులను ఎదుర్కొనేందుకు టీమిండియా లోయర్ ఆర్డర్ ఆపసోపాలు పడింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక్కరే గరిష్టంగా 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ 27 పరుగులు చేయగా, అశ్విన్ 17 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆండర్సన్, బ్రాడ్, ఆర్చర్ రూపంలో ముగ్గురు పేసర్లను తీసుకోగా, వారు నామమాత్రంగా మిగిలారు. ఆర్చర్ మాత్రం ఒక్క వికెట్ తీశాడు. మిగతా 9 వికెట్లను రూట్, లీచ్ పంచుకున్నారు.