రోహిత్ శర్మ సరసన చేరి మిస్టర్ కూల్!

మంగళవారం, 30 మే 2023 (10:51 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను తన కెప్టెన్సీలో సాధించిన ధోనీ.. ఐపీఎల్ టోర్నీలో ఏకంగా 250 మ్యాచ్‌లు ఆడిగిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరపున ఆడాడు. కొంతకాలం రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిథ్యం వహించాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ క్రికెటర్ 243 మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 177 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. అలాగే, ఐపీఎల్ సీజన్‌‍లో ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ రికార్డును ధోనీ సమం చేశాడు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు