ధోనీ ఖాతాలో చెత్త రికార్డు.. ఏంటది..?

సోమవారం, 8 జులై 2019 (18:55 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ప్రపంచ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పరుగులు  సాధించడంలో చేతులెత్తేస్తున్నాడు. స్లోగా పరుగులు చేస్తూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఫ్యాన్స్ ధోనీకి ఈ ప్రపంచకప్‌ ఏ మాత్రం కలిసి రావట్లేదని చెప్తున్నారు. స్లో బ్యాటింగ్‌తో విమర్శకులు ఎదుర్కొన్న ధోనీ.. కీపింగ్‌లో కూడా విఫలమయ్యాడు. 
 
ప్రపంచ అగ్రశ్రేణి వికెట్‌ కీపర్‌గా ఉన్న మహీ ఈ ప్రపంచకప్‌లో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాజు. ఏకంగా బైస్‌ రూపంలో 24 పరుగులు సమర్పించుకోవడంతో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక బైస్‌ ఇచ్చిన వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీ మొత్తం బైస్‌ రూపంలో 71 పరుగులే వచ్చాయి. ఇందులో ధోనీ ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం గమనార్హం.
 
ధోనీ తర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు. షై హోప్, జొస్ బట్లర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్‌ కీపర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. 9 ఔట్లతో ధోనీ 9 స్థానంలో కొనసాగుతున్నాడు.
 
శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే ధోనీ.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 4 బైస్ ఇచ్చాడు. మంగళవారం మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో అయినా ధోనీ మెప్పిస్తాడో చూడాలి. విమర్శకులకు చుక్కలు చూపించే ధోనీ సెమీఫైనల్స్, ఫైనల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు