కివీస్, ఆసీస్ టూర్.. మళ్లీ జట్టులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ

మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:55 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు గాను వన్డే, టీ20 జట్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కివీస్, ఆసీస్‌ జట్లతో ఆడే ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది. అయితే యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ ను వన్డే స్క్వాడ్ నుంచి తప్పించారు. 
 
ఇక ఆస్ట్రేలియా, కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ షమీలు బరిలోకి దిగుతారు. 
 
అలాగే ట్వంటీ-20ల్లో కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్‌లు వుంటారని బీసీసీఐ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు