AI దెబ్బకి ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేఆఫ్‌లు సాగుతూనే వున్నాయి. ఫలితంగా సుమారు 80,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా వీరి దారిలోనే యూ ట్యూబ్ కూడా పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.