బ్లోయెంఫోంటెయిన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ స్థాయి ఘన విజయం సాధించడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, 2001లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇప్పుడు దానిని తిరగరాసింది. తాజా విజయం ఆ దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది.
ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. జట్టులో డీన్ ఎల్గర్ (113), అయిడెన్ మార్కరమ్ (143), హషీం ఆమ్లా (132), ఫా డుప్లెసిస్ (135) సెంచరీలు చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.