టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ధోనీ నగరంలోని ఓ హోటల్‌లో జట్టు సభ్యులంతా బసకు దిగారు. ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆటగాళ్లు అక్కడ్నుంచి పరుగులు తీశారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.