ఆస్ట్రేలియా వెన్నువిరిచిన రవీంద్ర జడేజా - తొలి ఇన్నింగ్స్‌లో 177 ఆలౌట్

గురువారం, 9 ఫిబ్రవరి 2023 (15:49 IST)
నాగ్‌పూర్ వేదికగా ఆతిథ్య భారత్ - పర్యాటక ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ గురువారం నుంచి ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌కు భారత స్పిన్నర్లు తేరుకోలేని విధంగా దెబ్బతీశారు. గాయంకారణంగా జట్టుకు దూరమై ఈ టెస్టులో పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా అద్భుత ఫామ్‌తో ఆస్ట్రేలియా జట్టు వెన్ను విరిచాడు. ఆయనకు అశ్విన్ కూడా జతకలిశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో జడేజా ఐదు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు నేలకూల్చాడు. సిరాజ్, షమీలు ఒక్కో వికెట్‌ను పడగొట్టారు. 
 
ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్‌ (1)లను సిరాజ్, షమీలు పెవిలియన్‌‍కు పంపించారు. అప్పటికే ఆస్ట్రేలియా జట్టు స్కోరు కేవలం రెండు పరుగులు మాత్రమే. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) జోడీ నిలకడగా ఆడుతూ పట్టుసాధించేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, భారత స్పిన్నర్లు రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జడేజా, అశ్విన్‌లు పోటాపోటీగా వికెట్లు తీసి కంగారులను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఫలితంగా మాట్ రెన్ షా (0), కోంబ్ (31), టాడ్ మర్ఫీ (0), అలెక్స్ కేరీ (36), పాట్ కమిన్స్ (6) చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా టెయిలెండర్ స్కాట్ బోలాండ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌కు అశ్విన్ తెరదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు