అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 212 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఆ జట్టులో సీఫెర్ట్ 43, మున్రో 72, విలియమ్సన్ 27, గ్రాండ్‌హోం 30, మిచెల్19, టేలర్ 14 చొప్పున పరుగులు చేశాడు. ముఖ్యంగా, మున్రో చెలరేగి ఆడి 40 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో విజయం సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మున్రోకు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డను సీఫెర్ట్ దక్కించుకున్నాడు.