ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌కు సంబంధించి క్రికెట్ బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం తొలి మ్యాచ్‌ను మార్చి 30వ తేదీన కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. మే 25వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లోనే ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించనున్నట్టు ఆ కథనంలో పేర్కొంది.
అలాగే, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగుళూరు, లక్నో, ముల్లాన్‌పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలతో పాటు గౌహతి, ధర్మశాల ప్రాంతాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.
మార్చి 26, 30వ తేదీల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హోం మ్యాచ్‌లు గౌహతి వేదిగా జరిగే అవకాశం ఉందని తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లలో ఆర్ఆర్‌తో పోటీ పడుతాయని పేర్కొంది. అలాగే, ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టు రెండు హోం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా, జనవరి 12వ తేదీన ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరైన ఐసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ మార్చి 23వ తేదీన ఈ యేడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందని సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే, బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం ఈ యేడాది ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 23వ తేదీన ప్రారంభం కాదని స్పష్టం చేశారు.