వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న నేపథ్యంలో.. భారత ఆటగాల్లు హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. రెండో టెస్టుకు కావలసినంత విరామం దొరకడంతో కెప్టెన్ కోహ్లితో పాటు అతని భార్య అనుష్కశర్మ, రవిచంద్రన్ అశ్విన్, కే ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హార్బర్ సముద్రతీరంలో షిప్పింగ్ చేస్తూ తెగ జాలీగా గడుపుతున్నారు.
అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.