కొత్త జెర్సీతో టీమిండియా.. వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ ఫోటో (video)

బుధవారం, 21 ఆగస్టు 2019 (16:20 IST)
అంతర్జాతీయ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త జెర్సీతో టీమిండియా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ-20, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ పోటీల్లో బరిలోకి దిగే టీమిండియా కొత్త జెర్సీతో కనిపించనుంది. అంతర్జాతీయ టెస్టు సిరీస్‌లో కొత్త జెర్సీలో టీమిండియా బరిలోకి దిగనుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
వన్డే, టీ-20ల సందర్భంగా టీమిండియా క్రికెటర్లు జెర్సీల తరహాలోనే తాజా టెస్టు జెర్సీల్లో క్రికెటర్ల పేర్లు నెంబర్లు వుంటాయి. సంప్రదాయ టెస్టు మ్యాచ్‌ల్లో వున్న ప్రత్యేకతను ఈ జెర్సీలు అతిక్రమిస్తున్నాయని మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వున్నట్లు బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. 
 
టెస్టు పోటీలను క్రికెట్ అభిమానులకు మరింత నచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నామని.. ఇందులో భాగంగా జెర్సీలను కూడా మార్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇకపోతే.. తాజాగా కొత్త జెర్సీతో కూడిన విరాట్ కోహ్లీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు