నిర్భాగ్యులకే ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ గుర్బాజ్ దీపావళి గిఫ్ట్... ఏంటది? (Video)

ఆదివారం, 12 నవంబరు 2023 (15:49 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లలో ఆప్ఘనిస్థాన్ ఒకటి. మైదానంలో తమ ఆట తీరుతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులను సొంతం చేసుకుంది. అంతేనా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. అలాంటి జట్టు కెప్టెన్‌గా రహ్మనుల్లా గుర్బాజ్. ఈ టోర్నీ నుంచి స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆయన.. అహ్మదాబాద్‌లో తన పెద్ద మనసును చాటుకున్నారు. 
 
అహ్మదాబాద్ వీధుల్లో ఫుట్‌పాత్‌‍లపై దయనీయంగా బతుకుబండి లాగించే నిర్భాగ్యులకు ఆర్థిక సాయం చేశాడు. అది కూడా వారు నిద్రిస్తుండగా, వారికి తెలియకుండా వారి పక్కన కొంత డబ్బు ఉంచాడు. వారు ఆ డబ్బుతో దీపావళి వేడుకలు చేసుకోవాలన్నది గుర్బాజ్ కోరిక. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుర్బాజ్ మంచి మనసును నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. 
 
గుర్బాజ్ దాతృత్వంపై న్యూజిలాండ్ యువ సంచలనం రచిన రవీంద్ర కూడా స్పందించారు. "ఈ ఆప్ఘాన్ అబ్బాయిల మనసు నిజంగానే స్వచ్ఛమైన బంగారం అని అభివర్ణించారు. వారు ఎంతో దయగల క్రికెటర్లు. వారు భారత్‌లో ఇంతమంది అభిమానం పొందుతుండటంలో ఆశ్చర్యమేమీ లేదు. భారత్‌లో వారు మైదానంలోనూ, వెలుపల అందరి హృదయాలను గెలుస్తున్నారు" అంటూ ట్వీట్ చేశాడు. 

 

Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali.

- A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు