విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

ఠాగూర్

సోమవారం, 6 అక్టోబరు 2025 (19:43 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు సోమవారం రాత్రి ప్రమాదానికి గురైంది. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆయన జాతీయ రహదారి 44లో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా మినీ లారీ ఒకటి కారును ఓవర్ టేక్ చేయబోయి విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. 
 
అయితే, ఈ ప్రమాదం నుంచి హీరో విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన ప్రయాణించిన కారు ముందు భాగం బాగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంపై ఉండవల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు