ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు గుండెపోటు

శుక్రవారం, 2 డిశెంబరు 2022 (16:49 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు గుండెపోటు వచ్చింది. కామెంట్రీ చెబుతుండగా ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన స్టేడియం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు రెండు సార్లు ప్రపంచ కప్‌లు అందించిన ఘనత రికీ పాంటింగ్‌కు ఉంది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా - వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఆయన కామెంట్రీ చెబుతుండగా ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పైగా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురి చేసింది. ముఖ్యంగా క్రికెట్ పండింతులు, ఆయన అభిమానులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. 
 
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో రికీ పాంటింగ్ ఒకరు. 1995 నుంచి 2012 మధ్య కాలంలో జట్టుకు అపారమైన సేవలు అందించారు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్టులు ఆడిన రికీ... 13,378 పరుగులు చేశాడు. అలాగే, 375 వన్డేలో 13,704 రన్స్ చేశాడు. టెస్టుల్లో 41, వన్డేల్లో 30 చొప్పున సెంచరీలు సాధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు