రిషబ్ పంత్ మొత్తుకున్నా పట్టించుకోలేదు.. నవ్వారు.. వీడియో వైరల్

శుక్రవారం, 15 జనవరి 2021 (18:10 IST)
Rishabh Pant
బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 87 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌(28*; 70 బంతుల్లో 3x4), కెప్టెన్‌ టిమ్‌పైన్‌(38*; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నటరాజన్‌ 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ తీశారు.
 
అయితే బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒక ఔట్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ కోరామని పంత్ ఎంత మెుత్తుకున్న టీమిండియా క్రికెటర్లు పట్టించుకోలేదు. 84 ఓవర్‌లో నటరాజన్‌ వేసిన మూడో బంతి లెంగ్త్‌ బాల్‌ కాస్త స్వింగ్‌ అవుతూ బ్యాట్స్‌మెన్‌ను తాకుతూ వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లో వెళ్ళింది. దీంతో వెంటనే పంత్ ఔట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. కానీ ఆ అప్పీల్ అంపైర్‌ నుంచి మొదలుకొని టీమిండియా క్రికెటర్లూ ఎవరూ స్పందించలేదు.
 
డీఆర్‌ఎస్‌ కోరదామంటూ కెప్టెన్‌ రహానేకు చెప్పినా అతడు వినిపించుకోలేదు. స్లిప్‌ల్లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌, పుజారాలు కూడా విన్నపాన్ని నవ్వుతూ వదిలేశారు. దీంతో కాస్త పంత్‌ అసంతృప్తికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

Rishabh Pant was heaps keen on this one but he was getting donuts from the cordon!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు