ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల కన్నుమూత.. రాబిన్ జాక్మన్, జాన్ ఎడ్రిచ్ ఇక లేరు..

శనివారం, 26 డిశెంబరు 2020 (13:53 IST)
Robin Jackman
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రాబిన్ జాక్మన్ (75) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విచినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. దీంతో పలువురు వర్ధమాన ఆటగాళ్లు, మాజీలు ఆయనకు నివాళులు అర్పించారు. రాబిన్.. కెరీర్లో నాలుగు టెస్టులు (445 పరుగులు), 15 వన్డేలు(598 పరుగులు) ఆడారు. ఫాస్ట్ బౌలర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన.. 1966-1982 మధ్య కాలంలో తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 1,402 వికెట్లు తీశారు.
 
ఇంగ్లాండ్‌ వెటరన్‌ క్రికెటర్‌, సర్రే మాజీ కెప్టెన్‌ జాన్‌ ఎడ్రిచ్ (83) శుక్రవారం కన్నుమూశారు. ఇంగ్లాండ్‌ావేల్స్‌ క్రికెట్‌బోర్డు(ఇసిబి) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి టామ్‌ హార్రిసన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో జాన్‌ మృతితో ఓ విజయవంతమైన బ్యాట్స్‌మన్‌ను కోల్పోయమన్నారు. ఇంగ్లాండ్‌ తరఫున 77టెస్ట్‌ మ్యాచుల్లో ఎడ్రిచ్‌ 5వేలు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 103 శతకాలతో 39వేలకు పైగా పరుగులు చేశారు.
 
1965లో న్యూజిలాండ్‌పై 310(నాటౌట్‌) పరుగులు చేసి ఇంగ్లాండ్‌ తరఫున వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 1963లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసి 1976లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ ఓ ప్రకటనలో.. క్రిస్మస్‌ రోజు ఎడ్రిచ్‌ మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు