ఆటగాళ్లకు కరోనా : ఇంగ్లండ్ - సౌతాఫ్రికా వన్డే సిరీస్ రద్దు

మంగళవారం, 8 డిశెంబరు 2020 (13:47 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు అయింది. సౌతాఫ్రికా జట్టులోని ఆటగాళ్లకు ఈ వైరస్ సోకింది. దీంతో తొలి వన్డే వాయిదా వేశారు. ఆ తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇపుడు ఏకంగా వన్డే సిరీస్‌నే రద్దు చేశారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డులు తుది నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఈ వన్డే సిరీస్ కోసం ఎంపికైన ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు పెట్టిన బ‌యో బ‌బుల్‌లోనూ పాజిటివ్ కేసులు రావ‌డంతో సిరీస్‌ను ర‌ద్దు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేకుండా పోయింది. రెండు జ‌ట్ల ప్లేయ‌ర్స్ మానిసిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రెండు బోర్డులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశాయి. 
 
భ‌విష్యత్తులో ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మూడు వ‌న్డేల సిరీస్‌ను నిర్వ‌హించాల‌ని కూడా ఈ సంద‌ర్భంగా క్రికెట్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు నిర్ణ‌యించాయి. తొలి వ‌న్డేకు ముందు ఓ సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌కు క‌రోనా సోకింద‌న్న స‌మాచారంతో ఈ గంద‌ర‌గోళం మొద‌లైంది. 
 
దీంతో తొలి వ‌న్డేను మొద‌ట వాయిదా వేసి, త‌ర్వాత ర‌ద్దు చేశారు. రెండో వ‌న్డేకు ముందు ఇద్ద‌రు ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్‌కు కూడా పాజిటివ్ అని తేలడంతో ఆ మ్యాచ్‌నూ వాయిదా వేశారు. ఈ ప‌రిస్థితుల్లో టూర్ మొత్తాన్నే వాయిదా వేయ‌డం మేల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు క్రికెట్ సౌతాఫ్రికా చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు