వన్డే ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ.. ఐదో స్థానానికి పడిపోయిన కోహ్లి

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (17:12 IST)
వన్డే క్రికెట్ ర్యాంకులను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో భారత క్రికెటర్ల ర్యాంకులు తారుమారయ్యాయి. ఇటీవల పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ తర్వాత కొందరు భారత క్రికెటర్ల ర్యాంకులు మెరుగుపడగా, మరికొందరు ర్యాకులు పడిపోయాయి. ముఖ్యంగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో రాణించడంతో అతని ర్యాంకు రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే, మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ర్యాంకు ఐదో స్థానానికి పడిపోయాడు. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఫలితంగా 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజాం 770 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో నిలకడగా ఉన్నాడు. 
 
ఇకపోతే బౌలర్ల విషయానికి వస్తే, భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ మూడో స్థానానికి, రవీంద్ర జడేజా పదో స్థానానికి చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ చాంపియన్స్ ట్రోఫీలో 7 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. చాంపియన్స్ ట్రోఫీలో రాణించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కూడా బ్యాటింగ్‌ ర్యాంకుల్లో మెరుగుదల కనబరిచారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంటర్న్ రెండో స్థానికి చేరుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు