టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సమం చేశాడు. ఈ రికార్డును టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ముట్టుకోకపోవడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేశాడు.
ఇంతకీ ఆ రికార్డు వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాతో చివరి టీ-20 మ్యాచ్.. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఇందులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ శర్మ 9 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వద్ద అవుటైయ్యారు.
ఈ జాబితాలో సురేష్ రైనా (78 టీ-20 మ్యాచ్‌లు), కోహ్లీ (72 మ్యాచ్‌లు)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 111 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు ఆడటం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలోనూ పాకిస్థాన్ క్రికెట్ షాహిద్ అఫ్రిది 99 మ్యాచ్‌ల రికార్డుతో నిలిచాడు.