ధోనీ రిటైర్మెంట్ గురించి గంగూలీ ఏమన్నాడు.. కోహ్లీనే బెస్ట్..

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:43 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.. ధోనీ రిటైర్మెంట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా మాట్లాడుతూ.. ''ధోనీ రిటైర్మెంట్ గురించి సెలక్టర్లు ఏమనుకుంటున్నారో.. విరాట్ కోహ్లీ ఏమనుకుంటున్నాడో తనకు తెలియదు. జట్టుకు వాళ్లు ముఖ్యమైన వ్యక్తులు. నిర్ణయం వాళ్లకే వదిలేద్దాం.."అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
ఇక విరాట్ కోహ్లీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టీవ్ స్మిత్‌ కంటే.. విరాటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని, అతని రికార్డులే ఇందుకు నిదర్శనం. 26 టెస్ట్ సెంచరీలు అంటే.. సామాన్యమైన విషయం కాదని గంగూలీ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు