రిషబ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి.. ఎందుకో తెలుసా?

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:33 IST)
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేసుకుంటాడనుకున్నారు... క్రికెట్ ఫ్యాన్స్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. వరుసగా అవకాశాలు వస్తున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. అయితే అతడు మాత్రం పేలవమైన ఆటతీరుతో ఒకే తరహా షాట్ సెలక్షన్‌తో ఔట్ అవుతూ వస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించాడు. ''పంత్ తన షాట్ సెలక్షన్ మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించాడు. 'ఇక్కడ టాలెంట్‌ ఉందా..? లేదా? అనేది ముఖ్యం కాదు. నిలకడైన ఆట తీరే ప్రధానం. అతడికి మా ప్రోత్సాహం ఉంటుంది. 
 
కానీ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లోని ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే అతడు ఔటైన తీరు మళ్లీ రిపీట్‌ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒకవేళ అతడు ఇదే తరహా షాట్స్‌తో పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తే.. అతని స్థానంలో వేరొకరిని తీసుకోక తప్పదని పంత్‌కు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు