మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో 1999లో ఆడిన ఆస్ట్రేలియా టూరే అత్యంత కఠినమైందన్నాడు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉండేది. ఆ జట్టులోని 11 మందిలో ఏడెనిమిది మంది మ్యాచ్ విన్నర్లేనని.. రిజర్వ్ బెంచ్ కూడా మ్యాచ్ విన్నర్లేనని సచిన్ తెలిపాడు. తన ఇరవై ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ యాత్రలో అలాంటి జట్టును ఎప్పుడూ ఎదుర్కోలేదని సచిన్ గుర్తు చేసుకున్నాడు.