Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

సెల్వి

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (22:42 IST)
Vinay Narwal
జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నార్వాల్ తన భార్య హిమాన్షితో కలిసి పాకిస్తానీ పాటకు నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన ఈ జంట ఒక అందమైన దృశ్యం నెటిజన్లను కట్టిపారేసింది. ఈ జంట ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. ఇది వినయ్ నర్వాల్ చివరి వీడియోగా మిగిలిపోయింది. 
 
ఇకపోతే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, లెఫ్టినెంట్ భార్య పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన తన భర్తకు కన్నీటితో వీడ్కోలు పలికింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత, బుధవారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని టాంగ్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

दुःखद
नेवी ऑफिसर लेफ्टिनेंट विनय नरवाल की मौत से पहले का आखिरी वीडियो#PahalgamTerroristAttack pic.twitter.com/kIlP6mJc5E

— Manish Yadav लालू (Journalist) (@ManishMedia9) April 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు