ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపుడ్ జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లయిన 15 రోజులకే... మరోమారు ముగ్గురు తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన మహిళకు గజల్‌పుర్ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్ వివాహేతర సంబంధం ఉన్నట్టు భార్యకు తెలిసింది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన నవీన్‌కు నిర్మలతో రెండో పెళ్లి జరిగింది.
నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా ఉంది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫోటోలు వైరల్‌గా మారాయి.