సచిన్ టెండూల్కరా మజాకా.. 21 బంతులు 34 పరుగులు.. వరుసగా 3 బౌండరీలు (video)

సెల్వి

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (13:34 IST)
Sachin
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్)లో ఇండియా మాస్టర్స్ ఇంగ్లాండ్‌కు చెందిన తమ ప్రత్యర్థులపై తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో దిగ్గజ సచిన్ టెండూల్కర్ 21 బంతుల్లో 34 పరుగులు చేశారు. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇండియా మాస్టర్స్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. 
 
కెప్టెన్ టెండూల్కర్ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి క్రిస్ స్కోఫీల్డ్ చేతిలో ఔట్ అయ్యాడు. తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆతిథ్య జట్టు తరఫున గుర్కీరత్ సింగ్ మాన్ 35 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
 
యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐదవ ఓవర్లో టెండూల్కర్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. జెంటిల్మన్ గేమ్‌కు రిటైర్మెంట్ ఇచ్చి 12 ఏళ్లు కావొస్తున్నా మైదానంలో రఫ్పాడించాడు. 
 
బ్యాటింగ్‌తోనే కాదు.. కెప్టెన్సీతోనూ సచిన్ ఆకట్టుకున్నాడు. కాగా, బౌలింగ్‌లో 2 వికెట్లతో రాణించిన పవన్ నేగీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

SACHIN TENDULKAR - AT THE AGE OF ALMOST 52. ????pic.twitter.com/dMo0NVYDaF

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు